అనంతపురం జిల్లా కేంద్రంతో పాటు అనంతపురం పోలీసు సబ్ డివిజన్ పరిధిలో చైన్ స్నాచింగులు జరుగకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు హోంగార్డుల నుండీ ఎస్సైలు, సి.ఐ ల వరకు ఒంటరిగా ఉన్న ఇళ్ల ప్రాంతాలు, శివారు కాలనీల్లో సంచరించారు. తెల్లవారుజాము 5 గంటలకే గస్తీలు చేపట్టి మార్నింగ్ వాక్ కు వెళ్లేవారు, ఇళ్ల ముందు కసువు ఊడ్చడం,ముగ్గులు పెట్టడం లాంటి పనులలో నిమగ్నమైన మహిళల్ని అప్రమత్తం చేశారు. శివారు కాలనీల్లోని మహిళలతో సమావేశమై చైన్ స్నాచింగులు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన చేశారు. అంతేకాకుండా అనుమానితులైన వాహన చోదకులను చెక్ చేసి వారి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానితులు,అపరిచితులు కాలనీలు,శివారు ప్రాంతాలలో సంచరిస్తే వెంటనే డయల్ - 100 కు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.