తాడేపల్లి ప్యాలెస్ లో రాజ భోగాలు అనుభవిస్తున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు మీకు ఓటేసిన ప్రజలు ఎంతటి కష్టాల్లో ఉన్నారో ఓసారి చూడండి అని అనంతపురం టీడీపీ నాయకులూ పరిటాల శ్రీరామ్ తెలిపారు. వరదల్లో సర్వస్వం కోల్పోయి చివరికి తినడానికి బియ్యం కూడా లేని దుస్థితిలో ఉన్న ఈ ప్రజలను ఆదుకునే బాధ్యత మీది కాదా.? అని ప్రశ్నించారు. హెలికాప్టర్లలో ఏరియల్ సర్వేలు కాదు నేలపై దిగి చూస్తే ఇలాంటి నిజాలు తెలుస్తాయి. అని వరదలలో చిక్కుకొని ఇబ్బంది పడుతున్న కొంత మందిని వీడియో రూపంలో చూపిస్తూ తన ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. అలానే కొన్ని సామజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలు వరద బాధితులకి ప్రభుత్వం చేసిన సాయం ఇదా .... అంటూ నాలుగు ఉల్లిపాయలు , నాలుగు టమాటాలు , నాలుగు బంగాళా దుంపలని చూపిస్తూ వచ్చిన వార్తలను చూపిస్తూ.. ప్రశ్నిస్తున్నారు.