దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్ 585 పాయింట్ల లాభంతో 55,352 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 172 పాయింట్ల లాభంతో 16,514 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.79.94 గా ఉంది. రిలయన్స్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, టైటన్, టాటా స్టీల్, విప్రో, హెచ్యూఎల్, మారుతీ, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.