జార్ఖండ్ లోని రాంచీలో దారుణం జరిగింది. సంధ్యా టోప్పో అనే మహిళా ఎస్సైని వాహనంతో ఢీకొట్టి హత్య చేశారు. తుపుదన పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న సంధ్య మంగళవారం రాత్రి ఓ చెక్ పాయింట్ వద్ద విధులు నిర్వర్తిస్తోంది. ఓ వాహనాన్ని ఆపేందుకు ఆమె ప్రయత్నించగా, నిందితులు ఆపలేదు. ఈ క్రమంలో ఆమెపై నుంచి వాహనం దూసుకెళ్లింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.