రామాయపట్నం పోర్టుతో రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పోర్టు వల్ల ఎకనమిక్ యాక్టివిటీ పెరుగుతుందని, ఎంతో మంది యువతకు ఉద్యోగాలు వస్తాయని, రవాణా ఖర్చుకూడా గణనీయంగా తగ్గుతుంది. దీని వల్ల రాష్ట్రానికి, ఈ ప్రాంతానికి మేలు జరుగుతుందన్నారు. ప్రత్యక్షంగా 4 వేల మందికి.. పరోక్షంగా లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. పోర్టు రావడానికి సహకరించిన గ్రామాల ప్రజలకు సీఎం వైయస్ జగన్ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ఆరు పోర్టులు కాకుండా మరో నాలుగు పోర్టులు తేబోతున్నామని, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు, నాలుగు పోర్టుల పనులు వేగవంతం చేశామని అన్నారు. రెండునెలల్లో మిగతా వాటికి భూమి పూజ చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.