జనసేన పార్టీ నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమం ఒక వారం వాయిదా పడింది. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పర్యటన అనంతరం వైరల్ జ్వరానికి గురయ్యారు కాబట్టి , అలానే, పార్టీ అధ్యక్షులతోపాటు కొందరు ముఖ్య నాయకులు, ప్రోగ్రాం కమిటీ సభ్యులు, సెక్యూరిటీ సిబ్బంది కూడా జ్వరాలతో అనారోగ్యానికి గురయ్యారు అని జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ తెలియజేసారు. అందువల్ల వచ్చే ఆదివారం అంటే ఈ నెల 24 న కాకుండా 31వ తేదీన జనవాణి జరుగుతుంది. స్థలం, వేదిక వివరాలను త్వరలోనే తెలియచేయగలం. ఇప్పటికే విజయవాడ, భీమవరంలలో మూడు విడతల జనవాణి కార్యక్రమాలు పూర్తయిన విషయం విదితమే. రాయలసీమ, ఉత్తరాంధ్రలో మిగిలిన రెండు కార్యక్రమాలు జరుగుతాయి అని తెలియజేసారు.