పశ్చిమ బెంగాల్లోని హౌరా జిల్లాలో కల్తీ మద్యం తాగి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికిపైగా అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. మంగళవారం రాత్రి నాటు సార తాగడం వల్లనే అస్వస్థతకు గురైనట్లు స్థానిక అధికారులు తెలిపారు.