మహారాష్ట్రలో శివసేన ఎంపీ రాహుల్ షెవాలేపై దుబాయ్‌కు చెందిన ఓ మహిళ (33) అత్యాచార ఆరోపణలు చేసింది. అతడిపై చర్యలు తీసుకోవాలని సీఎం ఏక్నాథ్ షిండేకు మంగళవారం లేఖ రాసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, పలుమార్లు అత్యాచారం చేశాడని ఆరోపించింది. ఎంపీపై ముంబై సాకినాకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని వాపోయింది. న్యాయం చేయకుంటే తనకు ఆత్మహత్యే శరణ్యమని పేర్కొంది.