మద్యం మత్తులో కొందరు యువకులు రెచ్చిపోయారు. అటుగా వెళ్లుతున్న ఓ డెలివరీ భాయ్ పై దాడికి దిగారు. పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నడిరోడ్డుపై మద్యం మత్తులో స్విగ్గి డెలివరీ బాయ్‌పై దాడికి పాల్పడ్డారు. లక్ష్మీపురం మెయిన్ రోడ్డు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ దగ్గర ఈ ఘటన జరిగింది. డెలివరీ బాయ్‌పై యువకులు దాడి చేస్తున్న సమయంలో.. అటుగా వెళ్తున్న వారు వీడియో తీస్తూ దాడి చేస్తున్న వారిని వారించడంతో అక్కడి నుంచి పారిపోయారు. ఈ దాడిలో డెలివరీ బాయ్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పట్టాభిపురం పోలీసులు. ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. ఈ దాడి ఘటనకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. యువకులు అతడిపై దాడి ఎందుకు చేశారు, అతడి వివరాలు తెలియాల్సి ఉంది.