ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ పై ఇద్దరు మంత్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా యోగి కేబినెట్ లోని మంత్రి దినేశ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తాను దళితుడిని కావడం వల్లే తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపిస్తూ, రాజీనామా లేఖను కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు పంపించారు. మరో మంత్రి జితిన్ ప్రసాద్ కూడా యోగి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఢిల్లీ వెళ్ళి అధిష్టానానికి ఫిర్యాదుచేశారు.