నిత్యావసర వస్తువులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడంపై బుధవారం పార్లమెంటులో రాహుల్ గాంధీతో పాటు మిగతా కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాహుల్ పై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో రాహుల్ గాంధీ హాజరు 40 శాతం కంటే తక్కువేనని విమర్శించారు. సభలో ఒక్క ప్రశ్న కూడా సంధించని రాహుల్ ప్రొగ్రెస్ కార్డు ఇదేనంటూ ఎద్దేవా చేశారు.