దక్షిణ భారత దేశంలోనే ప్రసిద్ధి గాంచిన వెంకటగిరి గ్రామశక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి స్వర్ణ కిరీటం, స్వర్ణాభరణాలు తయారు చేస్తున్న విష యం తెలిసిందే. ఇందుకుగానూ వెంకటగిరికి చెందిన ప్రముఖ వస్త్ర వ్యాపార వేత్త నక్క వెంకటరమణయ్య సన్స్ వారు అమ్మవారి స్వర్ణ కిరీటానికి విరాళంగా లక్షా నూట పదహారు రూపాయలు రూపాయలు, పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది, వైయస్సార్ సిపి నాయకులు లక్కమనేని కోటేశ్వరరావు లక్ష 116 వేల రూపాయలు, డక్కిలి మండలం మాటుమాడుగు గ్రామానికి చెందిన మెట్టుకూరు ప్రసాద్ రెడ్డి ఆయన తల్లి మెట్టుకూరు సుబ్బమ్మలు లక్ష నూట పదహారు రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మెట్టుకూరు ప్రసాద్ వారి తల్లిని ఆలయ మర్యాదలతో ఘనంగా సన్మానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ విరాళాలను పోలేరమ్మ దేవస్థానం చైర్మన్ గొల్లగుంట మురళీకృష్ణ, ఆలయ ఈవో అరవభూమి శ్రీనివాసులరెడ్డికి అందజేసినట్లు రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ నక్క వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త నక్క దుర్గాప్రసాద్, ధర్మకర్తల మండలి సభ్యులు ఆవుల మోహన్ యాదవ్, ఆలయ సిబ్బంది కోటి పాల్గొన్నారు.