పి. గన్నవరం మండలం లంకల గన్నవరంలోని గోదావరి ముంపు గ్రామంలో బుధవారం కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, జెసి ధ్యాన చంద్ర, జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల రావు సివిల్ సప్లై అధికారులతో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ముంపు బాధిత కుటుంబాలకు ప్రభుత్వపరంగా కల్పిస్తున్న వసతులు, నిత్యవసరాలు, ఆహారం, త్రాగునీరు పాలు సరఫరాలు సవ్యంగా అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.