ఏపీలో దళితులపై దాడులు, వేధింపులు ఎక్కువయ్యాయి అని టీడీపీ అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... ఇదే విషయాన్ని చెప్పి దళితులను ఆదుకొమ్మని ప్రభుత్వాన్ని కోరినందుకు కాకినాడకు చెందిన మహాసేన మీడియా నిర్వాహకుడు రాజేష్ మీద అక్రమ కేసులు పెట్టి, శ్రీకాకుళం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ కు పిలిపించి వేధించడం దారుణం. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదనడానికి మహాసేన రాజేష్ ఉదంతమే నిదర్శనం. పోలీసులు అతని నుంచి వాహనాలను లాక్కోవాల్సిన అవసరం ఏమొచ్చింది? రాజేష్ విషయంలో ప్రభుత్వ తీరును ఖండిస్తున్నాను. ఇకనైనా రాజేష్ పై పెట్టిన అక్రమ కేసులను వెనక్కి తీసుకుని, అతనిపై వేధింపులను ఆపండి అని డిమాండ్ చేసారు.