కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 9,79,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. ఈ విషయాన్ని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయమంత్రి జితేంద్ర సింగ్ లోక్సభలో తెలిపారు. మొత్తం 40,35,203 ఉద్యోగాలు మంజూరు అయ్యాయని, వాటిలో 30,55,876 మంది ఉద్యోగులు విధుల్లో ఉన్నారని చెప్పారు. రిటైర్మెంట్, ప్రమోషన్లు, రాజీనామా, మరణాలు వంటి కారణాలతో ఖాళీలు ఏర్పడుతుంటాయని చెప్పారు.