శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట చెక్ పోస్టు కూడలిలో ఒక వ్యక్తి నుంచి నగదు, చరవాణి అపహరించిన ఘటన చోటు చేసుకుంది. రేణిగుంట పాంచాలీనగర్ కు చెందిన మునస్వామి బుధవారం రాత్రి చెక్ పోస్టు సమీపంలో వస్తుండగా ఐదుగురు యువకులు అతన్ని అడ్డగించి అతని వద్ద నుంచి ఫోన్, రూ. 13 వేలు అపహరించినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రేణిగుంట పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.