ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకు మంకీపాక్స్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 14 వేల మంకీపాక్స్ కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించింది. ఆఫ్రీకాలో ఐదుగురు ఈ మంకీపాక్స్ వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తెలిపారు. ఇది ఉండగా.. ఇండియాలో రెండో కేసును గుర్తించారు. రెండు కేసులు కేరళలోనే వెలుగుచూశాయి.