తుంగభద్ర ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి ప్రాజెక్ట్ లోకి చేరుంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 28 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. నేడు తుంగభద్ర ఇన్‌ఫ్లో 1,32,277 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ఫ్లో 93,423 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. తుంగభద్ర ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం 1631 అడుగులుగా ఉంది.