దక్షిణాది రాష్ట్రాల్లో వచ్చే అయిదేళ్లలో దాదాపు 25 లక్షల ఉద్యోగాల కల్పనకు భారత పరిశ్రమల సమాఖ్య కృషి చేస్తోందని బుధవారం హైదరాబాద్లో ‘బియాండ్ సౌత్ ఇండియా ఎట్ 75’ సమావేశంలో సీఐఐ దక్షిణ ప్రాంత ఛైర్పర్సన్ సుచిత్ర ఎల్ల వెల్లడించారు. ఇందులో ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలుంటాయన్నారు. తెలంగాణలో 5 లక్షలకు పైగా ఉద్యోగాలు వస్తాయని, ఏపీలోనూ ఇదే స్థాయిలో ఉద్యోగాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.