లోక్ సభలో కాంగ్రెస్ వాయిదా తీర్మాణం ఇచ్చింది. ఈడీ దుర్వినియోగం పై చర్చించాలని కాంగ్రెస్ వాయిదా తీర్మాణం ఇచ్చింది. వాయిదా తీర్మాణాన్ని ఎంపీ మాణిక్కం ఠాగూర్ స్పీకర్ కు అందించారు. దీని పై చర్చించాలని ఆయన పట్టు పడుతున్నారు. పార్లమెంట్ ప్రారంభమయ్యాక దీని పై చర్చిస్తారా లేదా అనేది చూడాలి. నేడు ఈడీ ముందుకు సోనియా గాంధీ హాజరవుతున్న విషయం తెలిసిందే.