రాష్ట్రవ్యాప్తంగా 2, 307 అద్దె బస్సులతోపాటు దాదాపు రూ. 250 కోట్లతో 617 కొత్త బస్సుల కొనుగోలుకు APSRTC గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందులో తిరుమల-తిరుపతి ఘాట్ రోడ్డులో నడిపే సప్తగిరి సర్వీసుల కోసం రూ. 54 కోట్లతో 152 ఎక్స్‌ప్రెస్‌లను కొనుగోలు చేయనుంది. జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాలకు తిరిగేందుకు డాల్ఫిన్, ఇంద్ర, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ కేటగిరీల్లో రూ. 194 కోట్లతో 465 బస్సులు కొనుగోలు చేయనుంది.