యూపీలో స్వైన్ ఫ్లూ కలకలం రేగింది. ఫతేపూర్‌లో నివసించే రాంబాబు అనే వ్యక్తి దాదాపు 10 రోజులుగా జ్వరం, జలుబు, దగ్గు, వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. తాజాగా వైద్యులను సంప్రదించగా వారు పరీక్షించి స్వైన్ ఫ్లూగా నిర్థారించారు. వెంటనే రాంబాబును కాన్పూర్‌లోని రీజెన్సీ ఆసుపత్రిలో చేర్చారు. ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని, రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లకూడదని చీఫ్ మెడికల్ ఆఫీసర్ అలోక్ రంజన్ సూచించారు.