ఇండో-నేపాల్ సరిహద్దులో భారీ కుట్ర భగ్నం చేశారు పోలీసులు. భారత్‌లోకి 2 కిలోల యురేనియంను అక్రమంగా తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు. మొత్తం 15 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. నేపాల్ కాట్మండు మీదుగా భారత్‌లోని బిహార్‌కు పేలుడు పదార్థాల్లో ఉపయోగించే ప్రమాదకర యురేనియంను తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో నేడు సరిహద్దులోని బిరాట్‌నగర్ వద్ద తనిఖీలు నిర్వహించగా నిందితులు పట్టుబడ్డారు.