అమెరికాలోని యుగీన్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్‌లో మరో భారత క్రీడాకారుడు ఫైనల్ చేరుకున్నాడు. పురుషుల ట్రిపుల్ జంప్‌లో ఎల్డోస్ పాల్ ఫైనల్ చేరి ఈ ఘనత సాధించిన భారత తొలి అథ్లెట్‌గా రికార్డు సృష్టించాడు. శుక్రవారం జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్లో ఎల్డోస్ 16.68 మీటర్ల దూరం దూకాడు. దీంతో గ్రూప్-ఎ క్వాలిఫికేషన్ రౌండ్లో ఆరో స్థానంలో నిలిచాడు. ఓవరాల్ గా 12వ స్థానంలో నిలిచాడు.