పెద్దముడియం మండల పరిధిలోని పలు గ్రామాల్లో అక్రమ మద్యం విక్రయాలపై పోలీసులు ముమ్మరంగా దాడులు నిర్వహించారు. ఎస్ఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో దాడులు చేపట్టి ఇలాంటి అనుమతులు లేకుండా మద్యాన్ని విక్రయిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని నుండి 96 క్వార్టర్ బాటిళ్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.