నక్కపల్లి మండలం అమలాపురం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం వేంపాడు ఆయుర్వేద ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కేసీహెచ్ రమేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆయుర్వేద మందులు పంపిణీ చేశారు. ముందుగా సీజనల్ వ్యాధులు ఎలా వ్యాప్తిస్తాయి? అవి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పించారు. అనంతరం
సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా, కఫం , జలుబు, దగ్గు వంటివి సోకకుండా, పిల్లల్లో ఇమ్యూనిటీ పెంచే చ్యవన ప్రాశ లేహ్యం, అగస్త్య హరీతక లేహ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ మాట్లాడుతూ పిల్లలలో శ్వాస కోశ వ్యాధులు నివారణకు కూడా ఈ మందులు ఎంతగానో పనిచేస్తాయని చెప్పారు. ఈ సీజన్ లో పిల్లలు కాచి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు. ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా వుండాలని, వ్యక్తిగత పరిశుభ్రత వుండాలని చెప్పారు. ఇందులో యోగా టీచర్లు కె. పార్వతీ దేవి, దవరసింగి రాంబాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.