టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శలు గుప్పించారు. ప్రజలకు సేవ చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కానీ, చంద్రబాబు మాత్రం ప్రచారం కోసమే పాకులాడతాడని విమర్శించారు. వరద బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామన్నారు. వరద ప్రాంతాల్లో మంత్రులు పర్యటించడం లేదంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు.