ఈ ఏడాది ఆసియా కప్ ను శ్రీలంకలో నిర్వహించాల్సి ఉంది. అయితే శ్రీలంకలో పరిస్థితులు బాగోలేకపోవడం వల్ల ఆ దేశ క్రికెట్ బోర్డు ఆసియా కప్ టోర్నీని నిర్వహించలేమని తేల్చి చెప్పేసింది. దీంతో శ్రీలంక వేదికగా జరగాల్సిన ఆసియా కప్‌ను యూఏఈకి మార్చినట్లు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ వెల్లడించారు. యూఏఈలో వర్షాలు పడే అవకాశం లేకపోవడం వల్ల దానినే వేదికగా ఖాయం చేసినట్లు గంగూలీ స్పష్టం చేశాడు.