ఇటలీ ప్రధానమంత్రి మారియో ద్రాగి కేవలం 17 నెలల్లోనే తన పదవికి రాజీనామా చేశారు. ఇటలీలో నెలకొన్న విపత్కర పరిస్థితుల వల్ల ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, విద్యుత్ ఛార్జీలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రభావాలపై ఆయన తమ దేశంలో ప్రధానిగా కొనసాగలేకపోయారు. కనీసం వేతనం, ఆదాయాన్ని ద్రాగి పట్టించుకోకపోవడం వల్ల విశ్వాస పరీక్షను మిగిలిన నాయకులు బహిష్కరించారు.