ఎన్డీయే అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల బరిలో దిగిన గిరిజన మహిళ ద్రౌపది ముర్ము ప్రత్యర్థి యశ్వంత్ సిన్హాపై భారీ ఆధిక్యంతో గెలుపొందిన విషయం తెలిసిందే. భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ముర్మును శుక్రవారం ఢిల్లీలో టీడీపీ ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎంపీ గల్లా జయదేవ్ తన సహచర ఎంపీలతో కలిసి వెళ్ళిన ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa