భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆగస్టు 13,14 తేదీల్లో జెండా ఎగురవేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇలా చేస్తే హర్ ఘర్ తిరంగా ఉద్యమం మరింత బలోపేతం అవుతుందని అన్నారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన వారి ఆశయాలను నెరవేర్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని ప్రధాని ట్వీట్ చేశారు.