చాలా మందికి మంకీపాక్స్ లక్షణాల గురించి సందేహాలున్నాయి. మంకీపాక్స్ లక్షణాలు సుమారు 5 రోజుల నుంచి 21 రోజుల్లో కనిపిస్తాయని వైద్యులు తెలుపుతున్నారు. జ్వరం, వణుకు, తలనొప్పి, వెన్నునొప్పి, కండరాల నొప్పి, అలసట వంటివి తలెత్తుతాయి. చర్మంపై దద్దుర్లు కూడా మంకీపాక్స్ సోకిన ఐదు రోజుల తర్వాతే ఏర్పడతాయి. ముందుగా అవి ముఖం మీద వచ్చి ఆ తర్వాత ఇతర శరీర భాగాలకు వ్యాపిస్తాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.