గుంటూరు: వినికిడి లోపం ఉన్న పిల్లలకు ఉచితంగా వినికిడి సాధనాలు అందజేయనున్నట్లు రాష్ట్రీయ బాలల ఆరోగ్య కార్యక్రమం జిల్లా సమన్వయకర్త శ్రావణ బాబు తెలిపారు. గుంటూరు సర్వజనాసుపత్రిలోని జిల్లా సత్వర చికిత్య కేంద్రంలో పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా సూచించారు. ఆసక్తి ఉన్నవారు కార్యాలయం పనిచేసే రోజుల్లో ఉదయం , 9నుంచి సాయంత్రం 4 గంటల వరకు 9642382249 నంబర్ కు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందిగా సూచించారు.