గోధుమలు ఎగుమతులపై రష్యా, ఉక్రెయిన్ మధ్య తాజాగా కీలక ఒప్పందం జరిగింది. ఇస్తాంబుల్లో ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్, అధ్యక్షుడు ఎర్డోగాన్ సమక్షంలో రెండు దేశాల మంత్రులు ఒప్పందంపై సంతకాలు చేశారు. దీంతో నల్లసముద్రం మీదుగా గోధుమలను ఉక్రెయిన్, రష్యాలు ఎగుమతులు చేయనున్నాయి. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం కారణంగా గోధుమల ఎగుమతులు ఆగిపోయాయి. సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది.