ఆధ్యాత్మిక యాత్ర ఆ భక్తుల కుటుంభాల్లో తీవ్ర విషాధాన్ని నింపింది. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో విషాదం చోటుచేసుకుంది. కన్వర్ యాత్రికులపై నుంచి ట్రక్కు దూసుకెళ్లడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. హత్రాస్ ఆగ్రా రోడ్డులోని బదర్ గ్రామంలో ఈ తెల్లవారుజామున 2.15 గంటల ప్రాంతంలో జరిగిందీ ఘటన. బాధితులందరూ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందినవారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించిన పోలీసులు తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఆగ్రా మెడికల్ కాలేజీలో చేర్చారు. కన్వర్ యాత్రికులు హరిద్వార్ నుంచి గ్వాలియర్‌కు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు కారణమైన ట్రక్కు డ్రైవర్‌ను గుర్తించామని, త్వరలోనే అతడిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa