అరుణాచల్ ప్రదేశ్‌లోని కురుంగ్ కుమే జిల్లాలో జూలై 13న 19 మంది రోడ్డు నిర్మాణ కార్మికులు గల్లంతు అయ్యారు. ఈరోజు మిస్సైనవారిలో ఏడుగురి ఆచూకీ తెలిసింది. రెస్క్యూ అధికారులు వాళ్లకు వైద్య సాయం అందిస్తోంది. కార్మికుల ఆచూకీ కోసం వైమానిక దళం సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టింది. బోర్డర్ రోడ్డు పనిలో నిమగ్నమైన కార్మికులు రెండు వారాల క్రితం తప్పిపోయారు. కుమే నదిలో ఓ కార్మికుడి డెడ్ బాడీ గుర్తించారు.