పుణెలో ఇద్దరికి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.5 పాజిటివ్‌గా తేలింది. దీనిపై మహారాష్ట్ర ప్రజారోగ్య విభాగం శనివారం ప్రకటన విడుదల చేసింది. జులై మొదటి వారంలో వారిద్దరూ దుబాయ్ నుండి తిరిగి వచ్చారని తెలిపింది. వారికి పుణె విమానాశ్రయంలో కోవిడ్-19 స్క్రీనింగ్ పరీక్ష చేసినట్లు వివరించింది. ఇద్దరు రోగుల శాంపిళ్లను పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపగా తాజాగా ఫలితాలు వచ్చాయని వెల్లడించింది.