సరదాగా ఆడుకుంటున్న చిన్నారి పౌలీనాపై ఓ కోతి దాడికి పాల్పడింది. పౌలీనా పేరెంట్స్ ఎంత ప్రతిఘటిస్తున్నా వారి మీద కూడా కోతి రక్తం వచ్చేలా దాడి చేసింది. వారి వెంటపడి మరీ చిన్నారిని లాగేసుకునే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన రష్యాలో చోటుచేసుకుంది. కోతి నుంచి పాపను పేరెంట్స్ రక్షించారు. కానీ, తీవ్రగాయాలు కావడంతో చాలా రక్తం పోయినట్టు వైద్యులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa