చైనా సిచువాన్ ప్రావిన్స్‌లోని కోర్టు శనివారం ఉదయం ఓ వ్యక్తికి ఉరిశిక్ష అమలు చేసింది. లైవ్ స్ట్రీమ్‌లో నిందితుడు తన మాజీ భార్యకు నిప్పంటించి ఆమెను హత్య చేశాడు. 2020 సెప్టెంబర్ 14న టిక్‌టాక్ చైనీస్ వెర్షన్ డౌయిన్‌లో టాంగ్ లూ అనే వ్యక్తి లైవ్ స్ట్రీమ్ పెట్టాడు. అందరూ చూస్తుండగానే తన మాజీ భార్య టిబెటన్ వ్లాగర్ లామో(30)కు నిప్పంటించారు. తీవ్రగాయాలతో ఆసుపత్రి పాలైన ఆమె కొన్ని రోజులకే మృతి చెందింది.