ఆక్యుపెన్సీ హెల్త్ అలవెన్స్ విషయంలో పారిశుద్ధ్య కార్మికులకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్ అందించింది. హెల్త్ అలవెన్స్‌కు నెలకు అదనంగా రూ.6 వేలు చెల్లించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనిపై శనివారం జీవో 233ను జారీ చేసింది. ప్రస్తుతం ఏపీలో పారిశుధ్య కార్మికులకు రూ.15 వేల మూల వేతనాన్ని ప్రభుత్వం అందిస్తోంది. తాజా నిర్ణయంతో వారి జీతం రూ.21 వేలకు పెరిగినట్లైంది.