భవిషత్త్యులో భారత్ జనాభాపై స్టాన్ ఫోర్డ్ అధ్యయనం ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 2100 నాటికి భారత్‌లో జనాభా దాదాపు 41 కోట్లు తగ్గిపోయి 100 కోట్లకు పరిమితం అవుతుందని తెలిపింది. భారత్‌లోనే కాదు, చైనా, అమెరికాలోనూ జనాభా క్షీణత పరిస్థితులు ఉంటాయని స్టాన్ ఫోర్డ్ అధ్యయనం చెబుతోంది. సంతానోత్పత్తి రేటు ఆధారంగా ఈ అంచనాలను ప్రకటించింది. ప్రస్తుతం భారత్ జనాభా పరంగా ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది.