యూపీలోని షామ్లీ జిల్లా ఖేదా కుర్తాన్ గ్రామంలో మంగళవారం దారుణం జరిగింది. అన్నం తింటున్నపుడు పదే పదే మ్యాంగో కావాలని అడిగిందని 5 ఏళ్ల బాలిక ఖైరు నిస్సాను మేనమామ ఉమర్దీన్ (33) కొట్టి చంపాడు. తొలుత బాలిక తలపై కొట్టాడు. రక్తం రావడంతో భయపడి ఆమె గొంతు కోసి ప్రాణం తీశాడు. తర్వాత గోనెసంచిలో మృతదేహం కుక్కి, ఇంట్లో ఓ మూల పెట్టాడు. అతడిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa