ప్రపంచ టెస్ట్ క్రికెట్ దిగ్గజమైన వెస్టిండీస్ మాజీ ఆటగాడు బ్రియాన్ లారా, మిస్టర్ డిపెండబుల్ గా పేరున్న టీమిండియా హెడ్ కోచ్ ద్రావిడ్ లు ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో దర్శనమిచ్చారు. శుక్రవారం వెస్టిండీస్‌లోని ట్రినిడాడ్‌లో జరుగుతున్న వన్డే మ్యాచ్ సందర్భంగా వీరిరువురూ కలిసిన ఫొటోను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనికి 'టూ లెజెండ్స్ ఇన్ వన్ ఫ్రేమ్' అంటూ క్యాప్షన్ ఇచ్చింది.