విశాఖకు పరిపాలన రాజధాని రావడం ఖాయమని వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ గా ఉన్న ఆయన అదివారంనాడు విశాఖలో పర్యటించారు. జీవీఎంసీ కార్పొరేటర్లతో ఆయన సమావేశమయ్యారు. విశాఖకు పరిపాలనా రాజధాని రావడం ఖాయమని స్పష్టం చేశారు. న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాక పరిపాలనా రాజధాని వస్తుందని వెల్లడించారు. ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి ఉంటుందని తెలిపారు. వార్డుల వారీగా అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తామని తెలిపారు. ఇక, గోదావరి వరదలు, విపక్షాల విమర్శలపైనా వైవీ స్పందించారు. కేవలం ఉనికి కోసమే గోదావరి వరదలపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు.