గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి నయూబ్ కమాల్ సమక్షంలో గుంటూరు కార్పోరేషన్ 48వ వార్డ్ నుంచి ST సామాజికవర్గ యువత అధిక సంఖ్యలో పార్టీలో చేరడం జరిగింది. వీరికి నాయకులు పార్టీ జెండా మెడలో వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. గతంలో వీరు వైసీపీ పార్టీ లో క్రియాశీలకంగా పనిచేసిన వారు గా చెప్పడం జరిగింది. అలానే ప్రస్తుతం వీరికి జనసేన పార్టీ సిద్ధాంతాలు మరియు పవన్ కళ్యాణ్ గారి అశయాలు నచ్చి పార్టీలోకి చేరడం జరిగింది అని తెలియజేసారు.