హైతీ దేశానికి చెందిన వలసదారులతో ప్రయాణిస్తున్న పడవ బహామాస్ సముద్రంలో బోల్తా పడింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ దుర్ఘటనలో 17 మంది చనిపోయారు. 25 మందిని బహమాస్ భద్రతా దళాలు రక్షించాయి. మృతుల్లో 15 మంది మహిళలు, ఒక పురుషుడు, ఒక శిశువు ఉన్నారని బహమాస్ ప్రధాని ఫిలిప్ బ్రేవ్ డేవిస్ ఒక ప్రకటనలో తెలిపారు. మానవ స్మగ్లింగ్ జరుగుతుందనే అనుమానంతో దర్యాప్తుకు ఆదేశించినట్లు చెప్పారు.