మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో మరో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సోమవారం సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్ వేసింది. గతంలో ఈ కేసును విచారించిన సెషన్స్ కోర్టు ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ ఇవ్వగా, సీబీఐ మొదట హైకోర్టును ఆశ్రయించింది. సీబీఐ విన్నపాన్ని హైకోర్టు తోసిపుచ్చడంతో, సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్ వేసింది.