ఏపీ హైకోర్టులో విదేశీ విద్యా పథకంపై విచారణ జరగింది. పథకాన్ని మైనారిటీ విద్యార్ధులకు ప్రభుత్వం నిలిపివేసిందంటూ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరపున షిబ్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. షిబ్లీ పిటిషన్‌పై లాయర్లు ప్రసాద్ బాబు, సలీమ్ పాషా వాదనలు వినిపించారు.
పథకం కింద ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించకుండా కొత్త పథకానికి ప్రభుత్వం జీఓ ఇచ్చిందని లాయర్లు పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ బాధ్యతారాహిత్యమని వాదనలు వినిపించారు. అయితే ప్రభుత్వం అలా జీవో ఇవ్వలేదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు చెప్పారు. వాదనలు విన్న హైకోర్టు రెండు వారాల్లో పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.