2018కి పోలవరాన్ని పూర్తి చేస్తాం..రాసుకోండి అన్నారు కదా?. ఆర్‌అండ్‌ఆర్ కంప్లీట్ కాకుండా ఎలా పూర్తి చేస్తారు? అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. మీడియా తో ఆయన మాట్లాడుతూ... టీడీపీ హయాంలో దుర్భుద్ధితో వ్యవహరించడంతోనే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఈ కష్టాలను సెట్‌రైట్ చేస్తున్నాం. మా ప్రభుత్వం ఆర్‌అండ్‌ఆర్‌కు రూ.1500 కోట్లు ఖర్చు చేసింది. మాట్లాడితే చాలు రాంబాబుకు ఏమి తెలియదు అంటున్నారు. తెలియదు కాబట్టే అందరిని కూర్చోబెట్టుకొని తెలుసుకుంటున్నాను. చేస్తాం..వాస్తవాలను గమనిస్తాం. జాతికి ద్రోహం చేసినవాళ్లు మమ్మల్ని విమర్శిస్తున్నారు. ఈనాడులో పెద్ద పెద్ద హెడ్డింగ్‌లతో కథనాలు రాయడం కాదు. వాస్తవాలు తెలుసుకోండి. ఈ విధ్వాంసాలకు కారణం చంద్రబాబు.. ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలు పిచ్చి పిచ్చి రాతలు రాసి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలని మీరు ప్రయత్నం చేసినా ఏమీ జరగదు. మేం చిత్తశుద్ధితో, ధర్మంగా పని చేస్తున్నాం. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి కలలు కన్న పోలవరాన్ని నిర్మించేందుకు తహతహలాడుతున్నాం. మాలో తపన ఉంది. అంతేతప్ప మీలా క్యాష్ కొట్టేయాలని, కమీషన్లు నొక్కేయాలనే ఆలోచన మాకు లేదు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి అని తెలియజేసారు.