రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థను వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టపరుస్తూ ఇంటింటికీ రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని తలపెట్టింది. అర్హత ఉన్న వాళ్లందరికీ రేషన్‌ఇస్తున్నాం అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. మీడియా తో ఆయన మాట్లాడుతూ... . ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 4.23 కోట్ల మంది లబ్ధిదారులు దీని నుంచి లబ్ధి పొందుతున్నారు. ప్రతి నెల క్రమం తప్పకుండా రూపాయికే కిలో బియ్యం ఇస్తున్నాం. ప్రపంచంలోనే కోవిడ్ నుంచి విపత్తు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. దాని ద్వారా అదనంగా 2.68 కోట్ల మందికి రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. మన రాష్ట్రంలో 4.23 కోట్లు ఉంటే గరిబ్ హఠావో కార్యక్రమంలో 2.68 కోట్ల మందికి మాత్రమే ఇస్తున్నారు. మనం అందనంగా కోటి 60 లక్షల మందికి ఇస్తున్నాం. మన రాష్ట్రంలో ఏప్రిల్ 2020 నుంచి మార్చి 2022 వరకు ఈ పథకాన్ని కేంద్రం ఇస్తున్న రేషన్‌తో పాటు మేం 4.23 కోట్ల మందికి అందిస్తున్నాం. గత మూడు నెలలుగా ఒక ఆలోచన చేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకోంది. అనాదిగా, ఆచారంగా వస్తున్న పౌరసరఫరా వ్యవస్థను మొత్తం జనాభాలో 95 శాతం మందికి రేషన్ ఇస్తున్నారు. కేంద్రం ఇస్తున్న రేషన్‌ను ఉపయోగించుకోవాలని, లబ్ధిదారులకు ఇవ్వాలని సీఎం వైయస్ జగన్ ఓ ఆలోచన చేసి మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని సూచన చేయమన్నారు. లబ్ధిదారుల సంఖ్య పెరుగుతున్నా ప్రభుత్వం అర్హులందరికీ బియ్యం అందిస్తున్నాం.
మేం ఇస్తున్న రూపాయికి బియ్యం కార్యక్రమం కంటిన్యూ అవుతోంది. కేంద్రం ఇస్తున్న బియ్యాన్ని ఎవరెవరికీ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం. వెనుకబడిన జిల్లాలకు గతంలో కేంద్రం ఇచ్చిన 7 జిల్లాల వారందరికీ సుమారు కోటి 66 లక్షల మందికి బియ్యం ఇవ్వాలని, వారితో పాటు ఇంకా రాష్ట్రంలోని పాత ఆరు జిల్లాల్లోని ఎస్సీ, ఎస్టీలందరికీ 89 లక్షల 2 వేల మందికి కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అలాగే అంత్యోదయ కార్డులు ఉన్న వారికి కూడా బియ్యం ఇవ్వాలని గుర్తించాం. వచ్చే నెల 1వ తేదీ నుంచి బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. రూపాయి బియ్యం అందరికీ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు డోర్ డెలీవరి చేస్తాం. ఏడు జిల్లాల్లోని సీటీలు, కార్పొరేషన్లు, అంటే విశాఖ, తిరుపతి నగరాలను మినహాయించి కొత్తగా ఏర్పాటైన ప్రకాశం జిల్లాను ఇందులో అదనంగా చేర్చుతున్నాం అని తెలియజేసారు.